
ఈ69 న్యూస్ ఐనవోలు
హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలోని ఒంటిమామిడిపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం కురిసిన అకాల వర్షం కారణంగా రాజారపు(శనిగల)బుచ్చయ్య కు చెందిన పలువురు గొర్రెలు,మేకలు మృతి చెందాయి.ఈ విషాద ఘటనపై గ్రామ శాఖ అధ్యక్షుడు గిరుక రాజు ఎమ్మెల్యేకి సమాచారం అందించారు.ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ప్రభుత్వ పశువైద్య అధికారి డాక్టర్ శరత్,ఆర్ఐ రాణి,తహసిల్దార్ సిబ్బంది వేణు,కొట్టం రమేష్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు.బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున తగిన సాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని,న్యాయం జరిగేలా చూస్తామని అధికారులు హామీ ఇచ్చారు.