
22/12/2022ఈ 69న్యూస్*వరంగల్* ట్రాఫిక్ ఇన్స్పెక్టర్:బాబులాల్* గౌరవ సిపి రంగనాథ్,ఐపిఎస్ గారి ఆదేశానుసారం ఈ రోజు వరంగల్ రైల్వే స్టేషన్ అడ్డ ఆటో డ్రైవర్లకు ఆపరేషన్ రోప్(రిమూవల్ ఆఫ్ ఆబ్స్ట్రాక్టివ్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్చ్మెంట్)లో భాగంగా డ్రైవర్ తమ వాహనాలను ఒక క్రమ పద్ధతిలో పార్కింగ్ చేసుకోవాలని,ప్రయాణికులను ఎక్కించుకునేటప్పుడు క్యారేజ్ వే బయట ఆటోలను నిలుపుకొని ఎక్కించుకోవలని, తమ అడ్డాలను ట్రాఫిక్ కి అంతరాయం లేనిచోట మార్చుకోవాలని,వచ్చే సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి ట్రాఫిక్ రూల్స్ పాటించని డ్రైవర్ల ఆటోలను ఆర్ టి ఓకి రాస్తమని,వెనక మరియు ముందర నంబర్ ప్లేట్స్ లేని ఆటోల ఓనర్స్ మీద చీటింగ్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడం జరిగింది,ఇట్టి కార్యక్రమంలో ట్రాఫిక్ యస్ఐలు రాజబాబు, రామారావు,ఆర్ఎస్ఐ,శ్రవణ్ కుమార్, ఆర్పిఎఫ్ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఏరియా కార్పొరేటర్ సునీల్ మరియు 140 మంది ఆటో డ్రైవర్లు పాల్గోన్నారు.