సురవరం సుధాకర్ రెడ్డి మరణంపై సిపిఎం జనగామ జిల్లా కమిటీ సంతాపం

ఈ69న్యూస్ జనగామ,ఆగస్టు 23
సిపిఐ జాతీయ కార్యదర్శి,మాజీ ఎంపీ కామ్రేడ్ అమరజీవి సురవరం సుధాకర్ రెడ్డి మృతి వామపక్ష ఉద్యమానికి తీరని లోటు అని సిపిఎం జనగామ జిల్లా కమిటీ పేర్కొంది.జీవితాంతం కార్మిక,రైతు,విద్యార్థి,మధ్యతరగతి ప్రజల హక్కుల కోసం పోరాడిన ఆయన త్యాగస్ఫూర్తి చిరస్మరణీయమని కమిటీ శ్రద్ధాంజలి ఘటించింది.వామపక్ష ఆలోచనలను విస్తరించి,సామాజిక న్యాయం కోసం కట్టుబడి పనిచేసిన సుధాకర్ రెడ్డి మరణం పేదలు,కూలీలు,రైతులకు మాత్రమే కాకుండా సమాజానికి పెద్ద నష్టం అని పేర్కొంది.కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డికి సిపిఎం జనగామ జిల్లా కమిటీ తరఫున జోహార్లు అర్పించింది.