
రైతాంగానికి అవసరమైన యూరియా అందుబాటులో ఉంచాలి: సీపీఎం
రైతాంగానికి అవసరమైన యూరియాను అందించి పంట పొలాలను రక్షించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున అన్నారు ఈరోజు నల్లగొండ మండల ఏవో శ్రీనివాస్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కావలసినంత యూరియా సరఫరా చేయక వివక్ష చూపుతోందని, నెలరోజులుగా నాట్లు వేసిన రైతులు యూరియా దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
సొసైటీలకు వచ్చిన యూరియాను అధికార పార్టీ నాయకులు, సొసైటీ డైరెక్టర్లు స్వాధీనం చేసుకుంటున్నారని,మార్కెట్లో యూరియా బ్లాక్ మార్కెట్ ద్వారా అధిక ధరలకు విక్రయమవుతోందనిఆరోపించారు పైగా రైతులను పురుగు మందులు బలవంతంగా కొనాలని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు.
కేంద్ర బిజెపి ప్రభుత్వం రాష్ట్రాలపై వివక్ష చూపుతోందని, తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం పోరాడాలని వారు డిమాండ్ చేశారు. ఖరీఫ్‌కు ముందు యూరియా స్టాక్ సరిపడా ఉందని అధికారులు చెప్పినా, ఇప్పుడు అది ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. అక్రమ నిల్వలు చేస్తున్న దళారులు, వ్యాపారస్తులపై తనిఖీలు జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యురాలు కొండ అనురాధ మండల కార్యదర్శి నడపరాజు సైదులు మండల కమిటీ సభ్యులు పోలే సత్యనారాయణ కొండ వెంకన్న మానుపాటి ఎల్లయ్య కుడుతాల భూపాలు వెంకన్న నరసింహ రాములు తదితరులు