ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈనెల 28,29లోగా అప్లై చేసుకోవాలి

ఈ69న్యూస్ వరంగల్
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడుస్తున్న జానపద గిరిజన విజ్ఞాన పీఠం,వరంగల్ ప్రాంగణంలో 2025-26 విద్యాసంవత్సరం ఎంఏ తెలుగు ప్రవేశాలు ప్రారంభమయ్యాయి.
*విశేషం ఏమిటంటే*
ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా నేరుగా అడ్మిషన్ పొందే అవకాశం కల్పిస్తున్నారు.తెలుగు భాషా అభివృద్ధి,పరిశోధన మరియు సాహిత్య పరిరక్షణలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ పీఠం,తెలుగు నేర్చుకోవాలనుకునే విద్యార్థులకు ఒక అద్భుత వేదిక.
*అడ్మిషన్ చివరి తేదీలు*
ఆగస్టు 28 మరియు 29,2025 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి.
*అర్హత:*
డిగ్రీలో తెలుగు సబ్జెక్ట్‌తో పూర్తిచేసిన విద్యార్థులు మాత్రమే ఈ ప్రవేశానికి అర్హులు.
*కోర్సు ప్రయోజనాలు:*
జానపద సాహిత్యం,గిరిజన సంస్కృతి,ఆధునిక తెలుగు సాహిత్యం మీద లోతైన అధ్యయనం.పరిశోధన,ఉపాధ్యాయ వృత్తి,రచన మరియు సాహిత్యరంగంలో మంచి అవకాశాలు.తెలుగు భాషాభిమానులకు ఉన్నత స్థాయి విద్య.-సంప్రదించుట కొరకు:9989139136