
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్
జనగామ జిల్లా,స్టేషన్ ఘనపూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి డి.యస్.వెంకన్న,జిల్లా పంచాయతీ అధికారి స్వరూప రాణి,మున్సిపల్ కమిషనర్ బి.రాధాకిషన్ ఆధ్వర్యంలో మంగళవారం రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో సమీక్షా సమావేశం జరిగింది.ఈ సమావేశంలో డివిజన్ పరిధిలోని సీఐలు,మండలాల ఎంవీడీఓలు,తహశీల్దార్లు,మున్సిపల్ సిబ్బంది,నీటి పారుదల శాఖ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.సమావేశంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.ఉత్సవాలు ఎటువంటి అంతరాయం లేకుండా ప్రశాంత వాతావరణంలో జరగాలనే దిశగా అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.