Cpm రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్ పిలుపు
Cpm రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్ పిలుపు
జనగామ. సెప్టెంబర్ 1 నుండి 17 వరకు తెలంగాణ రాష్ట్రంలో జరుగు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల కార్యక్రమాలను
జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు . మంగళవారం రోజున పార్టీ జిల్లా కార్యాలయంలో సింగార రమేష్ అధ్యక్షతన జిల్లా ముఖ్య నాయకుల సమావేశం జరిగింది . ఈ సమావేశంలో అబ్బాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ భూమికోసం
భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం అంటరానితనం పోవాలని ప్రజలందరూ ఆత్మగౌరవంతో బతకాలని జరిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఫలితంగా తెలంగాణ ప్రాంతంలో భూములు దక్కడమే కాకుండా స్వేచ్ఛ దక్కిందని అన్నారు నిజాం రజాకార్లు జాగిర్దారులు జామిందార్లుభూస్వాములు ప్రజలతో వెట్టి చేయించుకుని భూములు వారి చేతిలో పెట్టుకొని అనేక అగైత్యాలకు పాల్పడుతున్న సందర్భంలో ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో జరిగిన సాయిధరైతంగా పోరాటపలితంగా 10 లక్షల ఎకరాల భూములు పేదలకు పంచడమే కాకుండా 3000 గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటుచేసుకోవడం జరిగిందన్నారు ఈ పోరాటంలో 4,000 మంది అమరులైనారని అమరుల యా ది లో
ఈ సాయుధ పోరాట కార్యక్రమాలు వివిధ రూపాల్లో జరుగుతాయన్నారు జెండా ఆవిష్కరణలు సభలు సమావేశాలు ర్యాలీలు కళాకారుల ఆటలు పాటలు అమరవీరుల కుటుంబాల సన్మాన కార్యక్రమం ఉంటుందన్నారు ఈ కార్యక్రమానికి జాతీయ రాష్ట్ర నాయకులు హాజరవుతారు అనేక త్యాగాలు చేసి ప్రజలకు స్వేచ్ఛ వాయువులు కల్పించిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని కేంద్రంలో అధికారంలోఉన్న బిజెపి ప్రభుత్వం వక్రీకరించి వక్రభాష్యాలు చెబుతూ అమరవీరులను అవమానపరిచే విధంగా రాజకీయ అవకాశాల కోసం ప్రజల్ని పక్కదోవ పట్టించే విధంగా మాట్లాడుతూరాజకీయ లబ్ది పొందాలని చూస్తుందన్నారు. ఈ పోరాటంతో సంబంధం లేని బిజెపి ఆర్ఎస్ఎస్ తెలంగాణ సాయుధ పోరాటం హిందూ ముస్లింల మధ్య జరిగిందని విద్వేషాలు రెచ్చగొట్టే దుర్మార్గమైన పద్ధతికి వడిగట్టిందన్నారు కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూమి కోసం సామాజిక అణచివేత కు వ్యతిరేకంగావ్యతిరేకంగా జరిగిన పోరాటంలో హిందువులు ముస్లింలు కలిసి నిజాం రజాకార్ల దోపిడీ
అణచివేతకు వ్యతిరేకంగాపోరాటంలో పాల్గొని ప్రాణాలర్పించిన మహోత్తరమైన పోరాటంఈ పోరాట ఫలితంగా దేశంలో భూసంస్కరణలుఅమలయినాయి. బిజెపి ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో రైతుల భూములు గుంజుకొని కార్పోరేట్ శక్తులకు అప్పగించే విధంగా చట్టాలు చేస్తుంది.పత్తిపై 11 శాతం దిగుమతి సుంకాలు ఎత్తివేయడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉందన్నారు తెలంగాణ రైతంగ సాయుధ పోరాటస్ఫూర్తితో బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలమీద పోరాడాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డిజిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఈ అహల్య సాంబరాజు యాదగిరి బోట్లశేఖర్జిల్లా కమిటీ సభ్యులు
బూడిద గోపి జోగు ప్రకాష్పుత్కనూరు ఉపేందర్మునిగల రమేష్ బోడ నరేందర్ భూక్యచందు నాయక్ బెల్లంకొండ వెంకటేష్నాయకులు మాచర్ల సారయ్య బొడ్డు కరుణాకర్మదర్ బోట్ల శ్రావణ్ అన్నిబోయిన రాజు తదితరులు పాల్గొన్నారు