పౌష్టికాహారమే పసిపిల్లల ఆరోగ్యానికి మేలు
Uncategorized

ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
పిల్లల ఎదుగుదలకు ఆరోగ్యంగా ఉండేలా పరిసర ప్రాంతాలలో పరిశుభ్రతతో పాటు మంచి పేరు ఆహారాన్ని అందించాలని పోషకాహార వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని రావులపల్లె అంగన్వాడి సెంటర్లో ఏడబ్ల్యూటి ఏడేల్లి దేవేంద్ర ఆధ్వర్యంలో అంగన్వాడి సెంటర్ పిల్లల తల్లులకు గ్రుడ్లు,బాలమృతం వంటి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లల ఎదుగుదల కోసం పాస్టికారమైన ఆహారాన్ని తీసుకోవడం ఎంతో ఉపయోగమన్నారు.పిల్లల ఎదుగుదలకు ఆరోగ్యంగా ఉండేందుకు పరిసరాల ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిల్లల తల్లులకు సూచించారు.కార్యక్రమంలో భాగంగా హెల్త్ నెస్ గురించి అంగన్వాడి టీచర్ దేవేంద్ర మాట్లాడుతూ భోజనంకు ముందు చేతులను శుభ్రంగా నీటితో కడుక్కోవాలని అనంతరం భోజనం తీసుకోవాలని సూచించారు.అంగన్వాడి సెంటర్ నుండి అందజేస్తున్న గుడ్లను ప్రతిరోజు పిల్లలకు తినిపించాలని, గర్భిణీ స్త్రీలు రోజు ఒక గుడ్డు చొప్పున తినాలని,సెంటర్ కు వచ్చి రోజు పాలు భోజనం చేసి వెళ్లాలని ఏడబ్ల్యుటి దేవేంద్ర అవగాహన కల్పించారు.అనంతరం సెంటర్లో బాలింతలకు పిల్లల తల్లులకు బాలామృతం ప్యాకెట్లు,గ్రుడ్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆశ కార్యకర్త హసీనా బేగం,ఎన్జీవో దీన,బాలింతలు,పిల్లల తల్లులు పాల్గొన్నారు.