ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్న జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ ఈ69న్యూస్ హైదరాబాద్,సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శిల్పకళా వేదికలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో జనగామ జిల్లా విశిష్ట గుర్తింపు సాధించింది.దేశవ్యాప్తంగా నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో తెలుగు రాష్ట్రాల నుండి ఒక్క జనగామ జిల్లా మాత్రమే టాప్ 50 జిల్లాల్లో చోటు దక్కించుకుంది.ఈ విజయానికి దిశానిర్దేశం చేసినందుకు గుర్తింపుగా,రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అవార్డు అందుకున్నారు.ఆయనతో పాటు అదనపు కలెక్టర్,జిల్లా విద్యా అధికారి పింకేష్ కుమార్ కి కూడా ఈ ఘనత లభించింది.అధికారులు మాట్లాడుతూ..ఉపాధ్యాయుల కృషి,విద్యార్థుల ప్రతిభ,పాఠశాలల అభివృద్ధి పట్ల పట్టుదల ఫలితంగా ఈ విజయాన్ని సాధించామని పేర్కొన్నారు.