ప్రశాంతంగా వినాయక నిమజ్జనాలు జరుపుకోవాలి
Jangaon, Telangana, TELUGU NEWSగణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రజలందరూ ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ఐక్యంగా నిమజ్జన కార్యక్రమాలను జరుపుకోవాలని నేటి సమాజ పరిస్థితులలో యువత పెడ ధోరణిలకు చెడు అలవాట్లు వ్యసనాలకు పోకుండా చదువు క్రీడలు వ్యాయామం వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచి ఉన్నతమైన మంచి సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని వరంగల్ వెస్ట్ జోన్ డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజా మహేంద్ర నాయక్ గారు యువతను,ప్రజలకు పిలుపునిచ్చారు.శనివారం రోజున జనగామ పట్టణంలోని ఐదో వార్డు డబుల్ బెడ్ రూమ్ ఎసిరెడ్డి నగర్ కాలనీలో గణేష్ నిమజ్జన ఉత్సవాలలో పూజ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ ..గణేష్ నవరాత్రుల ఉత్సవాలు కులాలకు అతీతంగా మతాల కు అతీతంగా తొమ్మిది రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆటలతో పాటలతో నవరాత్రుల ఉత్సవాలు ప్రజలందరూ జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. నిమజ్జన ఊరేగింపు సందర్భంగా మద్యం సేవించి ఎలాంటి ఘర్షణలు పెట్టుకోరాదని ప్రజలందరూ నిమజ్జన సందర్భంగా చెరువుల వద్ద కుంటల వద్ద చిన్న పిల్లలను చెరువుల వద్దకు తీసుకు వెళ్ళకుండ తగు జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని వారు కోరారు. ఆయనతోపాటు జనగామ టౌన్ సిఐ దామోదర్ రెడ్డి ఎస్సైలు రాజేష్ చెన్నకేశవులు మరియు జోగు ప్రకాష్ సుంచు విజేందర్ బూడిది ప్రశాంత్ పాము బిక్షపతి ధరావత్ మహేందర్ రాగల్ అంజయ్య మారబోయిన శివ తాండ్ర రాజు ఆత్కూరి ఎల్లయ్య బూడిది సంపత్ కర్రె గౌతమ్ భాస్కర్ కళ్యాణ్ ఉప్పలయ్య పందిళ్ళ కళ్యాణి పల్లె లలిత బూడిది అంజమ్మ బిట్ల లక్ష్మి విజయ అశోకు బాలకృష్ణ మదన్ కుమార్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.