ఈ69 న్యూస్ స్టేషన్ ఘనపూర్,సెప్టెంబర్ 8 తెలంగాణ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదేశానుసారం,వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అన్నం బ్రహ్మరెడ్డి సూచనలతో ఇందిరమ్మ కమిటీ తమ్మడపల్లి జి గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించింది.మొత్తం 26 ఇండ్లలో 2 రద్దు కాగా,16 ఇండ్లకు బెస్మెంట్ బిల్లులు మంజూరైనట్లు,2 ఇండ్ల బిల్లులు ఈకెవైసి సమస్యల వల్ల ఆగిపోయినట్లు,మరో 2 ఇండ్ల బిల్లులు రావాల్సి ఉందని,4 ఇండ్లు నిర్మాణంలో కొనసాగుతున్నాయని కమిటీ వెల్లడించింది.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పందిబోయిన యాకయ్య,గాదే బిక్షపతి,వడ్లకొండ హైమావతి,మాజీ వార్డు సభ్యులు సతీష్,అజయ్,మాచెర్ల మహేందర్,ఆకోజు యాదగిరి,కొంతం సోమయ్య,కొత్త వెంకన్న,దాసరి ఎల్లయ్య,రంగు సంపత్,బెజ్జం శ్రీనివాస్,ఎండి బాషా,పాక రాములు,అనిల్,కూరపాటి రాజు,గాదే లక్ష్మణ్,కశిరబోయిన రాజు తదితరులు పాల్గొన్నారు.లబ్ధిదారులు ఈ సందర్భంగా గృహాలు మంజూరు చేసినందుకు కడియం శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు.