ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఘనపూర్ స్టేషన్ రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో మంగళవారం ఘనంగా వేడుకలు జరిగాయి.ఈ సందర్భంగా ఆర్డీవో డి.యస్.వెంకన్న కార్యాలయ సిబ్బందితో కలిసి కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ..కాళోజీ తెలంగాణ జీవిత చలనశీలిగా,స్వాతంత్ర్య సమరయోధుడిగా,తెలంగాణ ఉద్యమకారుడిగా,ప్రజాకవిగా మహనీయుడని పేర్కొన్నారు.ఆయన కవిత్వం తెలంగాణ ఉద్యమానికి చైతన్యం నింపి రాష్ట్ర సాధన దిశగా ప్రజలకు మార్గదర్శకంగా నిలిచిందని గుర్తుచేశారు.ఈ కార్యక్రమంలో డివిజనల్ పరిపాలన అధికారి డి.శంకరయ్య,డిప్యూటి స్టాటిస్టికల్ అధికారి శ్రీనివాస రెడ్డి,నాయబ్ తహశీల్దార్లు వేణు కుమార్,సునంద,సీనియర్ సహాయకులు డి.ఉపేందర్,శ్రీనివాస్,సుష్మ,జూనియర్ సహాయకులు వినోద,వినయ్,సృజన్ కుమార్,బంగారి,శ్రీనివాస్,సునీల్,సంతోష్,టైపిస్టు ఎల్లయ్య,రికార్డు అసిస్టెంట్ వి.వెంకటేశ్వర్లు,సువార్త,సబార్డినేటర్లు సారయ్య,అశోక్,సురేందర్,అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.