ఈ69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ శరవేగంగా బుగులోని వెంకటేశ్వర స్వామి వారి జాతర పనులు జరుగుతున్నట్లు జాతర చైర్మన్ రొంటాల వెంకటస్వామి తెలిపారు.ఈ మేరకు చైర్మన్ మంగళవారం గ్రామ కమిటీ నాయకులతో కలిసి జాతర అభివృద్ధి పనులను పరిశీలించారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సహకారంతో జాతరలో నీటి గుండం,మంచినీటి బావి,కొండపైకి ఎక్కే మెట్ల మార్గం వెడల్పు కార్యక్రమాలు రూ.2 కోట్ల నిధులతో పనులు ప్రారంభమయ్యాయని నవంబర్ మాసంలో వచ్చే జాతరకు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించి అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని చైర్మన్ వెంకటస్వామి తెలిపారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మల విజేందర్,నాయకులు పల్నాటి శ్రీను,జాతర అర్చకులు కుర్మాచలం వెంకటేశ్వర్లు,యాట ప్రశాంత్,తదితరులు పాల్గొన్నారు.