
పరకాల ఎమ్మెల్యే రేవూరి
తెలుగు గళం న్యూస్, పరకాల, సెప్టెంబర్ 21
ఆదివారం పరకాల పట్టణ కేంద్రంలోని అంగడి మైదానం మరియు దామెర చెరువు వద్ద జరగనున్న బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే బతుకమ్మ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.మహిళలు, కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొనబోతున్నందున,
తాగునీరు,శానిటేషన్, లైటింగ్ వ్యవస్థ,భద్రత,వంటి సదుపాయాలను సమగ్రంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సద్దుల బతుకమ్మ,దసరా పండుగకు ఎలాంటి అంతరాయం లేకుండా విజయవంతంగా జరిగేందుకు ప్రతి ఒక్క శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.