
యూనియన్ బ్యాంక్ మేనేజర్ చేతివాటం
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్ సురేష్ నకిలీ పత్రాలతో గోల్డ్ లోన్ మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.వివరాల ప్రకారం,మేనేజర్ సురేష్ తన కుటుంబ సభ్యుల పేర్లపై నకిలీ పత్రాలు సిద్ధం చేసి,గోల్డ్ లాకర్లో ఉన్నట్లు చూపిస్తూ రుణాలు మంజూరు చేసినట్లు సమాచారం.అసలు బంగారం లాకర్లో లేకుండా ఖాళీ పౌచులు మాత్రమే ఉంచి,సుమారు రూ.74 లక్షల 92 వేల విలువైన గోల్డ్ లోన్ రుణాలు తీసుకున్నట్టు బయటపడింది.ఈ అవకతవకలు బ్యాంక్ సహోద్యోగి ఫిర్యాదుతో బయటకు వచ్చాయి.ప్రస్తుతం ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు జారీచేసి,మోసపూరిత లావాదేవీలపై పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించారు.స్థానిక ప్రజలు ఇటువంటి ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ,బ్యాంక్‌లోని భద్రతా వ్యవస్థలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.