
శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ చైర్మన్ గా మోడెం ఉమేష్ గౌడ్
గీత కార్మికుల ఐకమత్యం,అభివృద్ధికి నిదర్శనంగా ప్రతి గీత కార్మికుడు కృషి చేయాలని శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ చైర్మన్ గా మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన మోడెం ఉమేష్ గౌడ్ పేర్కొన్నారు.గీతా కార్మికులు ప్రతి ఏటా మాదిరిగానే తాటి చెట్లు ఎక్కే కార్మికులు అక్టోబర్ మాసంలో కొత్త తాళ్లను ఎంపిక చేసుకునే సందర్భంగా సోమవారం శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో చైర్మన్ ఉమేష్ గౌడ్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో నూతన ఆలయ కమిటీ చైర్మన్ తో సహా సభ్యులను ఎన్నుకోగా,గౌడ సంఘం అధ్యక్షులుగా తడక మల్లేష్ గౌడ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఆలయ చైర్మన్ గా మరోసారి ఉమేష్ గౌడ్ ఎంపిక కాగా,సభ్యులుగా పాలకుర్తి శ్రీను గౌడ్,కొండ మల్లయ్య గౌడ్,గుండెబోయిన రాజు గౌడ్,మాడగాని సారయ్య గౌడ్,గండి వెంకన్న గౌడ్,మాడగాని శంకర్ గౌడ్,మోటపోతుల సంతోష్ గౌడ్,భైరగాలి రాజేందర్ గౌడ్,ఓరుగంటి తిరుపతి గౌడ్ ఆలయ సభ్యులుగా ఎన్నిక కాగా,గౌడ సంఘం అధ్యక్షులుగా మల్లేష్ గౌడ్ తో పాటు కొండ తిరుపతి గౌడ్,బండి కొమురయ్య గౌడ్,మాడగాని సమ్మయ్య గౌడ్,మచ్చిక కుమారస్వామి గౌడ్,పోడేటి మొగిలి గౌడ్,గండి తిరుపతి గౌడ్,తడక సతీష్ గౌడ్,కత్తి శంకర్ గౌడ్,తాళ్ల పెళ్లి సుధాకర్ గౌడ్ లను గీత కార్మిక నాయకుల సూచన మేరకు ఎన్నుకోవడం జరిగిందని ఆలయ చైర్మన్ ఉమేష్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ ఉమేష్ గౌడ్ మాట్లాడుతూ.. గీతా కార్మికులు ఐక్యమత్యంతో ముందుకు సాగాలని,కార్మికుల కుటుంబంలో ఇలాంటి ఆపదలు వచ్చిన మందుండాలని,అభివృద్ధిలో మనవంతు సహకారాన్ని ఎప్పటికీ అందిస్తూ ముందుకు సాగాలని ఉమేష్ గౌడ్ పిలుపునిచ్చారు