
శైలపుత్రి అలంకారంలో భ్రమరాంబిక అమ్మవారి దర్శనం
హన్మకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం ఆవరణలో గల శ్రీ భ్రమరాంబిక దేవి ఆలయంలో శరన్నవరాత్రుల తొలి రోజు అమ్మవారు సోమవారం శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమైన కార్యక్రమంలో విఘ్నేశ్వరపూజ,శైవశుద్ధి పుణ్యాహవాచనం,పంచగవ్యప్రాశనం,ఋత్విక్వరుణ దీక్షాదారణ,అఖండదీపారాధన,త్రిశూలపూజ,అంకురారోపణ,మంటపారాధన,ప్రధాన కలశస్థాపన నిర్వహించారు.అనంతరం అమ్మవారి నవ కలశ నవరత్న సుగంధ పరిమళ ద్రవ్యాభిషేకం చేసి నవరాత్రి వ్రతారంభం జరిగింది.తరువాత నిత్యాహ్నికం,మహానైవేద్యం,నీరాజన మంత్రపుష్పం,తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు.ఈ వేడుకల్లో దేవస్థానం చైర్మన్ కమ్మగాని ప్రభాకర్ గౌడ్,ఉప ప్రధాన అర్చకులు పాతర్లపాటి రవీందర్,ప్రధాన అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్,ఐనవోలు మధుకర్ శర్మ,వేదపండితులు గట్టు పురుషోత్తమ శర్మ,విక్రాంత్ వినాయక్ జోషి,అర్చకులు నందనం భాను ప్రసాద్,మధు శర్మ,శ్రీనివాస్,నరేష్ శర్మ,దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.భక్తులు,అర్చక సిబ్బంది,ధర్మకర్తల మండలి సభ్యులు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు.దీని వివరాలను దేవాలయ కార్యనిర్వాహణాధికారి కందుల సుధాకర్ తెలిపారు