
యునైటెడ్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు హనుమకొండ జిల్లా కార్యదర్శి ఉప్పలయ్య
CITU డిమాండ్
యునైటెడ్ బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ UBWU(CITU అనుబంధం) నందనం గ్రామ కమిటీని ఈరోజు అనగా సెప్టెంబర్ 23న ఎన్నుకోవడం జరిగింది.
హనుమకొండ జిల్లా అయినవోలు మండలం నందనం గ్రామములో యునైటెడ్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు మహాసభ ఇస్రం సుదర్శన్ అధ్యక్షతన జరిగింది.
ఈ యొక్క మహాసభ కి యునైటెడ్ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు హనుమకొండ జిల్లా కార్యదర్శి ఉప్పలయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడడం జరిగింది.
ఈ సందర్భంగా టి ఉప్పలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనాలోచితంగా తెలంగాణ రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తూ తెలంగాణ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా అమలు చేస్తున్నటువంటి స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పడం ద్వారా ఈ అన్యాయం తలపెట్టిందని టీ ఉప్పలయ్య విమర్శించారు.
ప్రమాద బీమాకిచ్చే పది లక్షల రూపాయలు సహజ మరణానికి ఇచ్చే రెండు లక్షల రూపాయలు పెంచుతూనే ఈ రెండు స్కీములతో పాటు పాక్షిక శాశ్విత అంగవైకల్యాలకు ఇచ్చే నష్టపరిహారాలతో పాటు మొత్తం నాలుగు స్కీములను ప్రవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు జూలై రెండున జీవో నెంబర్ 12 ను జారీ చేసింది. దీనివలన భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని విమర్శించారు. కావున వెంటనే భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు ద్వారా అమలు జరిగే నాలుగు స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వకుండా ప్రభుత్వమే నిర్వహించాలని, జీవో నెంబర్ 12 ను వెంటనే రద్దు చేయాలని టి ఉప్పలయ్య డిమాండ్ చేయడం జరిగింది. లేనియెడల రాబోయే కాలంలో ఈ జీవోను ఉపసంహరించుకునే అంతవరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా మాజీ కోశాధికారి కే లింగయ్య పాల్గొన్నారు
అనంతరం నందనం గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ కమిటీ అధ్యక్షులుగా ఏకరా రమేష్, గ్రామ కార్యదర్శిగా ఈశ్వరం సుదర్శన్, గ్రామ గౌరవ అధ్యక్షులుగా ఈశ్రం చిన్నబాబు.వర్కింగ్ ప్రెసిడెంట్ గా మల్లయ్య.కోశాధికారిగా ఏకరా శ్రీనివాసు. గౌరవ సలహాదారుగా యాకరం మల్లయ్య. సహాయ కార్యదర్శిగా దోమకొండ కనకయ్యను.ఉపాధ్యక్షులుగా బర్ల సోమయ్యను ఎన్నుకోవడం జరిగింది. మరో 12 మంది కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది.