
సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి
సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ వెంకటస్వామి
మానవపాడు టీఎస్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఉన్న దుకాణాల అద్దెలు తగ్గించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఏ. వెంకట్ స్వామి డిమాండ్ చేశారు.దుకాణాల అద్దెలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలో కేవీపీఎస్ ఆధ్వర్యంలో సీఐటీయు కార్యాలయం నుండి RTC డిపో వరకు ర్యాలీ నిర్వహించి,డిపో ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి మాట్లాడుతూ గత 25 సంవత్సరాల క్రితం నిరుపయోగంగా ఉన్న బస్టాండ్ ఆవరణలో దుకాణాలు ఏర్పాటు చేసుకొని జీవనం కొనసాగిస్తున్న దుకాణాదారులపై జీఎస్టీ, మెయింటెనెన్స్ పేరుతో చిరు వ్యాపారులపై భారాలు మోపుతున్నారని విమర్శించారు.చిరు వ్యాపారులపై ఆర్థిక భారాలు పడకుండా జిల్లా అధికారులు ఉపశమనం కల్పించాలని కోరారు. అల్లంపూర్ మానవపాడు శాంతినగర్ రాజోలి మండలాలలో ఉన్న బస్టాండ్ ఆవరణలో అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించాలని కోరారు. నిరుపయోగంగా ఉన్న మరుగుదొడ్లను ఉపయోగంలోకి తేవాలని మరుగుదొడ్ల నిర్వహణ కోసం కాంట్రాక్టర్కు ఆర్టీసీ నుండి 25000 ఇస్తున్న మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచడం లేదని విమర్శించారు. మరుగుదొడ్లను శుభ్రం చేయడం కోసం యాసిడ్ ఫినాయిల్ చీపుర్లు బ్లీచింగ్ పౌడర్ కాంట్రాక్టర్ సప్లై చేయకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.కంప చెట్లు ముళ్లపదులు ఉన్నాయని బస్టాండు ఆవరణలో గుంతలు ఏర్పడి ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెరువులను తలపించేలా ఉన్నాయని అన్నారు. బస్టాండులో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి బస్సుల రాకపోకల వివరాలను పొందుపరచాలని అన్నారు.దేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంగా నైనా బస్టాండ్ లో కనీస వసతులు సమకూర్చాలని అన్నారు.అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిఎం సునీత గారికి అందజేశారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పరంజ్యోతి,రాజు జిల్లా కమిటీ సభ్యులు విజయ్,మారెన్న, వెంకటస్వామి,సవారన్న,సుధాకర్, దుకాణదారులు రంగన్న,రాజశేఖర్, లక్ష్మీనారాయణ, నాయుడు,ఫారుక్, రవి తదితరులు పాల్గొన్నారు.