
నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం, నర్సింహులపేట మండలం లోని ప్రసిద్ది గాంచినా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నూతన చైర్మన్ ప్రమాణస్వీకార కార్యక్రమం బుధవారం ఘనంగా, భక్తిశ్రద్ధల మధ్య జరిగింది. ఈ సందర్భానికి ఆలయ ప్రాంగణం భక్తులతో నిండిపోగా, మంగళవాయిద్యాలు మరియు హారతుల మధ్య ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ హాజరై,నూతన పాలకమండలి చైర్మన్ వేముల విజయపాల్ రెడ్డి కి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు,అనంతరం ఆలయ అర్చకులు స్థానిక శాసనసభ్యునికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు, అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు స్వీకరించారు, ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ,దేవస్థానం అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుంది అని భక్తుల సౌకర్యార్థం అవసరమైన మౌలిక వసతులు – రోడ్లు, నీటి సదుపాయం,పార్కింగ్ స్థలాలు, వసతి గృహాల నిర్మాణం వంటి పనులకు ప్రభుత్వం సహకరిస్తుంది అని, ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక నిధుల సమీకరణ, విరాళాల సేకరణ వంటి కార్యక్రమాలకు కూడా మేము తోడ్పడతాం” అని ఈ సందర్భంగా పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు,మండల అధ్యక్షుడు జినకల రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసోజ్ రాజశేఖర్, ఎస్టీ సెల్ అధ్యక్షుడు దస్రు నాయక్,యువనేత ఓరుగంటి శ్రీకాంత్, ప్రజాప్రతినిధులు, గ్రామ మాజీ సర్పంచులు, స్థానిక నాయకులు మరియు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని కొత్త చైర్మన్కు అభినందనలు తెలిపారు. అనంతరం నూతన పాలకవర్గం స్థానిక శాసనసభ్యుడికి ధన్యవాదాలు తెలిపారు మాకు అప్పగించిన ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని మాపై ఉండాలని ఆ భగవంతుని కోరుకున్నారు.