
ఈ69న్యూస్ జనగామ:రాష్ట్రంలో వ్యవసాయ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ అన్నారు.బచ్చన్నపేటలో జరిగిన మండల మహాసభలో ఆయన మాట్లాడుతూ బ్యాంకులు రైతులకు సరైన రుణాలు ఇవ్వకపోవడం,రుణమాఫీ అమలు చేయకపోవడం,వరదలతో పంటలు నష్టపోయినా పరిహారం చెల్లించకపోవడం రైతాంగాన్ని ఆర్థిక కష్టాల్లోకి నెట్టిందన్నారు.పత్తి ధరల వ్యత్యాస చెల్లింపు పథకం (PDPS) రైతులకు నష్టదాయకమని పేర్కొంటూ,గిట్టుబాటు ధరలు లభించేలా కనీస మద్దతు ధర పెంచాలని,పత్తి దిగుమతులపై సుంకాలు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.