
ఆకర్షనీయంగా చెరువు మత్తడి
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి చెరువులు,వాగులు వంకలు నీటితో నిండి పొంగి పొర్లుతున్నాయి.ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలోని చెరువు జలకళతో కనువిందుచేస్తోంది. నిండు కుండలా ఉన్న చెరువు మత్తడి పోస్తూ జలపాతంలా ఆకర్షనీయంగా కనువిందు చేస్తోంది. చెరువు వద్దకు చూసేందుకు గ్రామస్తులు, ఇతరులు భారిగా తరలి వస్తున్నారు.పొంగి పొర్లుతున్న నీటిలో జలకాలాడుతూ ఆనందోత్సాహంతో మునిగి తెలుతున్నారు.సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. గ్రామ ప్రజలు ఆనందంతో పూజలు చేస్తున్నారు.ఈ పూజ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చామల మహేందర్ రెడ్డి,పీ ఏ సీ ఎస్ డైరెక్టర్ రమేష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు చొక్కం యాదగిరి, మాజీ సర్పంచ్ గోనెల సమ్మక్క- రాజయ్య,మాజీ ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్,మాజీ ఉప సర్పంచ్ వేములకొండ రజిత-బిక్షపతి, మాజి సర్పంచ్ గడ్డం లక్ష్మి- రాజేందర్, ఇందిరమ్మ కమిటి సభ్యులు కోతి సాంబరాజు,గై కృష్ణ మూర్తి, గట్టుమల్లన్న దేవస్థాన డైరెక్టర్ వీరన్న, మాజీ వార్డ్ మెంబర్ సతీష్,కాంగ్రెస్ పార్టీనాయకులు,రైతులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.