
కల్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కుల పంపిణి
పరకాల పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు, నదికూడా,పరకాల టౌన్ మండలాలకు చెందిన 111మంది అర్హులైన లబ్దిదారులకు కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అందించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలోనే సంక్షేమమే ప్రధాన బాధ్యతగా ఈ ప్రభుత్వం పని చేస్తుందని రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.అభివృద్ధి ద్వారా బీఆర్ఎస్ నాయకుల నుంచి మొదలుపెడితే చంద్రశేఖర రావు కుటుంబం వరకు దోచుకుతిన్నారని ఎమ్మెల్యే రేవూరి అన్నారు. ప్రజల వల్ల ఏర్పడ్డది ఈ ప్రజా ప్రభుత్వం అని అన్నారు. గత పాలకులు రాష్ట్ర వనరులను ఎలా దోచుకు తిన్నారో మీరందరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.10 సంవత్సరాలు అధికారంలో ఉండి 8లక్షల 25 కోట్ల అప్పు చేసి ఫామ్ హౌస్ లో పడుకున్నారని ఎమ్మెల్యే రేవూరి అన్నారు.కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్లు దోచుకున్న అప్పు వాళ్లు చేసిన అప్పు వడ్డీతో సహా నెలకు 6,వేల 500 కోట్లు ఈ కాంగ్రేస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కడుతుందని అన్నారు.అంత అప్పులో ఉన్న సరే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆపడం లేదని అన్నారు.గత పాలకులు కాంట్రాక్టర్ల కోసం ఇండ్లు కూలగొట్టారని అన్నారు. నేను ఎక్కడ ఆ పని చేయలేదని చేయబోనని ఎమ్మెల్యే రేవూరి అన్నారు. 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పాలనలో రైతులకు ఏ వస్తువు కొన్న వందకు వందశాతం సబ్సిడీ ఇస్తామన్నారు కాని 10 ఏండ్లలో ఎక్కడైనా ఇచ్చారా అని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు.