
పట్టించుకోని గ్రామ పంచాయతీ సిబ్బంది
హన్మకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రం నుండి నాగపురం వైపు వెళ్లే రోడ్డులో టెంపుల్ సౌత్ గేట్ దగ్గర మలుపు వద్ద ఏర్పడిన గుంత స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తోంది.ఈ గుంత చాలా రోజులుగా అలాగే ఉండిపోయినా గ్రామ సిబ్బంది పట్టించుకోలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.ప్రమాదాలు జరగకుండా తక్షణమే గ్రామ పంచాయతీ ఈ గుంతను మూసివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.