
లెనిన్ నగర్లో సైబర్ క్రైమ్,డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం
ఈ69న్యూస్:వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ మండలం మామునూర్ పరిధిలోని నాయుడు పెట్రోల్ పంప్ సర్కిల్ సమీపంలోని లెవీన్ నగర్లో డ్రగ్స్ మరియు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సీఐ రమేష్, ఎస్సై శ్రీకాంత్ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా సీఐ రమేష్ మాట్లాడుతూ..యువత డ్రగ్స్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.సైబర్ నేరాల మోసాలకు లోనవ్వకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.తల్లిదండ్రులు తమ పిల్లలపై క్రమం తప్పకుండా నిఘా ఉంచి చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా మార్గనిర్దేశం చేయాలని పిలుపునిచ్చారు.ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ..డ్రగ్స్ వాడకం వ్యక్తిగత జీవనాన్నే కాక సమాజాన్ని కూడా దెబ్బతీస్తుందని,ప్రతి ఒక్కరూ దీనికి వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు.అలాగే సైబర్ నేరాల నుండి రక్షణ పొందడానికి అపరిచిత లింకులు క్లిక్ చేయకూడదని,వ్యక్తిగత వివరాలు ఎవరికీ ఇవ్వకూడదని చెప్పారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు పాల్గొని ప్రశ్నలు అడిగి అవగాహన పొందారు.