
ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి
భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.ఈ మేరకు ఆదివారం సాయంత్రం భూపాలపల్లి మంజూరునగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి మీడియాకు పత్రికా ప్రకటన విడుదల చేశారు.గ్రామాలల్లో నిండిన చెరువులు, పచ్చని పంట పొలాల పక్కన ప్రకృతితో మమేకమై, తొమ్మిది రోజుల పాటు సాగిన ఆడబిడ్డల ఆటాపాటలతో పల్లెలు, పట్టణాలు ప్రత్యేక సాంస్కృతిక వాతావారణాన్ని సంతరించుకున్నాయన్నారు.ఈ సందర్భంగా విజయాలను అందించే విజయదశమిని స్వాగతిస్తూ, తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం చేపట్టిన పనులు పూర్తయ్యాయని ఎమ్మెల్యే ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లేలా, ప్రజలంతా సుఖశాంతులతో జీవించి, దినదినాభివృద్ధి పొందేలా దీవించాలని అమ్మవారిని ఎమ్మెల్యే ప్రార్థించారు.