
ఎస్సై రామచరణ్ సస్పెన్షన్
ఈ69న్యూస్:జనగామ జిల్లా జఫరఢ్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న రామచరణ్ పై అవినీతి ఆరోపణలు రావడంతో సస్పెన్షన్ వేటు పడింది.గత కొద్ది రోజులుగా ఆయనపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో స్థానిక నాయకులు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ దృష్టికి విషయం తీసుకెళ్లారు.ఈ మేరకు ఉన్నతాధికారులు విచారణ జరిపి నివేదికను సమర్పించారు.ఆ నివేదిక ఆధారంగా ఆదివారం రాత్రి కమిషనర్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు.ఫిర్యాదుదారుల నుండి డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలు నిజమని తేలడంతో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.