రేగొండలో మైసూరు బేకరీ ప్రారంభోత్సవంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు..


ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా ఎదగాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సూచించారు.రేగొండ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన మునుస్వామి కి చెందిన మైసూరు బేకరీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరై ప్రారంభించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి మార్గాలను ఎంచుకొని ఆర్థికంగా బలపడాలని ఎమ్మెల్యే సూచించారు.యువత స్థానికంగా వ్యాపార కేంద్రాలను ఆరంభించి ప్రజాసేవ చేస్తూ,ఉపాధి పొందాలని సూచించారు. యువత స్వయం ఉపాధి అవకాశాలతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు.తాము ఉపాధి పొందడంతో పాటు మరో పది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.నాణ్యమైన సేవలతో వినియోగదారుల మన్ననలను పొందాలన్నారు. భూపాలపల్లి, పరకాల పట్టణాలతో పాటు చుట్టుపక్కల ఉన్న కొత్తపల్లిగోరి, చిట్యాల, టేకుమట్ల మండల కేంద్రాలకు కేంద్ర బిందువుగా ఉన్న రేగొండ మండల కేంద్రం శరవేగంగా అన్ని వ్యాపారాలకు అనువుగా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఆర్ చైర్మన్ రాష్ట్ర నాయకులు నాయనేని సంపత్ రావు, పిఎసిఎస్ చైర్మన్ నడిపెల్లి విజ్జన్ రావు, భూపాలపల్లి వ్యవసాయ కమిటీ చైర్మన్ గుటోజు కిష్టయ్య మాజీ ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇప్పకాయల నర్సయ్య, కాంగ్రెస్ జిల్లా నాయకులు మోడెమ్ ఉమేష్ గౌడ్ మేకల బిక్షపతి గంగుల రమణారెడ్డి,మాజీ ఎంపిటిసి సుమలత బిక్షపతి పట్టెం శంకర్ రేగొండ మండల మహిళా మండలి అధ్యక్షురాలు బూర్గుల ప్రమోద రాణి ,కాంగ్రెస్ పార్టీ రేగొండ టౌన్ అధ్యక్షుడు ఏనుగు రవీందర్ రెడ్డి లింగాల గ్రామ కమిటీ అధ్యక్షుడు ఆకుల మల్లయ్య బుగులోని జాతర మాజీ చైర్మన్ రెంటాల వెంకటస్వామి తిరుమలగిరి గ్రామ కమిటీ అధ్యక్షుడు నిమ్మల విజేందర్ రూపురెడ్డి పల్లె మాజీ సర్పంచ్ బండారి కవిత దేవేందర్ జగ్గయ్యపేట సర్పంచ్ పాత పెళ్లి సంతోష్ మండల సీనియర్ నాయకుడు మటికే సంతోష్ ఉమ్మడి మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు పొనుగోటి వీర బ్రహ్మం గోరి కొత్తపల్లి మాజీ సర్పంచ్ సూదనబోయిన ఓం ప్రకాష్ , సత్తన్న యువసేన అధ్యక్షులు మోట్టే కిరణ్ పటేల్, సత్తన్న యువసేన నాయకులు సామల సురేందర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కోయిల క్రాంతి, మైసూర్ బేకరీ నిర్వాహకులు ఉమేష్,స్థానిక నాయకులు పాల్గొన్నారు.