
ఈ69న్యూస్ జయశంకర్ భూపాలపల్లి రేగొండ
రేగొండ మండల కేంద్రంలో భారత దేశం జాతిపిత మోహన్ దాస్ కరంచంద్ మహాత్మా గాంధీ జయంతిని టౌన్ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను ఘనంగ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో రేగొండ టౌన్ అధ్యక్షుడు కోలేపాక బిక్షపతి మాట్లాడుతూ సత్యాగ్రహం అహింస శాంతియుత మార్గంలో దేశ ప్రజలందరినీ ఏకతాటిగా చేసి స్వేచ్ఛ అనేది మనకే కాకుండా అందరికీ ఉండాలని చాటి చెబుతూ దేశ స్వతంత్రాన్ని సాధించిన కరంచంద్ మహాత్మా గాంధీ గారికి నివాళులర్పిస్తూ ఆయన జయంతి ఉత్సవాలను ఈరోజు ప్రపంచమంత జరుపుకుంటున్నాయి అలాంటి మహానాయకునికి జయంతి జరుపుకోవడం మన అదృష్టం అని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ వైస్ చైర్మన్ సామల పాపిరెడ్డి,రైతు అధ్యక్షులు ఏనుగు లింగారెడ్డి,సీనియర్ నాయకులు గోగుల చంద్రకర్ రెడ్డి,గుర్రల సుమన్ రెడ్డి,గూటం బుచ్చిరెడ్డి,మాజీ ఉపసర్పంచ్ పోశాలు,మేకల రాజు,యూత్ నాయకులు మాడగాని నరేష్,తడుక శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.