
మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించిన జంగా
పాలకుర్తి నియోజకవర్గం సన్నూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కుందూరు విక్రం రెడ్డితండ్రి కుందూరు భీష్మారెడ్డి శుక్రవారం కన్నుమూశారు.ఈ వార్త తెలిసిన వెంటనే తెలంగాణ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి సన్నూరుకు చేరుకుని,భీష్మారెడ్డి పార్థివ దేహానికి పూలమాల అర్పించి ఘన నివాళులు తెలిపారు.తరువాత విక్రం రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.కుటుంబ సభ్యులను ధైర్యం చెప్పి,తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.అదేవిధంగా,ఇటీవల తండాల గ్రామానికి చెందిన అమృతమ్మ మరణించడంతో ఆమె కుటుంబాన్ని కూడా జంగా రాఘవరెడ్డి పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.