*కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ పినపాక ప్రభాకర్ సతీమణి శ్రీమతి మంగా దేవి జన్మ దినం సందర్భంగా మానసింక వికలాంగులకు అన్నదానం*ఈ రోజు జడ్చర్ల లోని శ్రీ సత్యేశ్వర సేవా ఆశ్రమం లో మానసిక వికలాంగులకు పినపాక ప్రభాకర్ సతీమణి పినపాక మంగాదేవి జన్మ దినం సందర్భంగా నిత్యం జరుగుతున్న నిత్య అన్నదాన యజ్ఞానికి ఎంతో ఉదార స్వభావంతో ఆర్ధిక సహకారం అందించటం తో నిర్వహుకులు శ్రీ చిత్తనూరి ఈశ్వర్, శ్రీ చిత్తనూరి రామకృష్ణ అన్నదానం నిర్వహించారు. దయామయులు , ఉదార స్వభావులు , సమాజ సేవా తత్పరులు శ్రీ పినపాక ప్రభాకర్ గారి సతీమణి శ్రీమతి పినపాక మంగాదేవి గారి పుట్టినరోజు సందర్బంగా ఇక్కడి అనాధ మానసిక దివ్యంగులకు ఈరోజు అన్నదానం చేయడం సంతోషంగా ఉందని, వారికి వారి కుటుంబ సభ్యులకు మరియు బందు మిత్రులకు ఆ భగవంతుడు అష్ట ఐశ్వర్యాలు, ఆయుః ఆరోగ్యాలు నిండుగా మెండుగా ప్రసాదించాలని ఆ భగవంతుడిని వెడుకుంట్టున్నట్లు నిర్వహకులు అభినందనలు తెలిపారు.