
సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) రాష్ట్ర 4వ మహాసభ పోస్టర్ ఆవిష్కరణ ఈరోజు (తేది: 03`10`2025)న సిఐటియు కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ రాష్ట్ర 4వ మహాసభలు 2025 అక్టోబర్ 26`27 తేదీలలో రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నంలో జరగనున్నాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో మొదటి రోజు బహిరంగ సభలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై పెద్దఎత్తున పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ. రమ మాట్లాడుతూ అక్టోబర్ 26`27 తేదీలలో జరిగే మహాసభలకు 500 మంది ప్రతినిధులు హాజరవుతారని, ఈ మూడు సంవత్సరాల కాలంలో చేసిన పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవడం కోసం ఈ మహాసభల్లో చర్చిస్తాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పెద్దఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వై. స్వప్న, సిఐటియు రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ఎం. చంద్రమోహన్లు పాల్గొన్నారు.