టీ షర్ట్స్.. సూపర్ హిట్
వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో ఉత్పత్తి ప్రారంభించిన సౌత్ కొరియా దిగ్గజం
రూ. కోటి విలువైన 15 వేల టీషర్టుల ఉత్పత్తి
‘ఫామ్ టు ఫ్యాబ్రిక్’ నినాదంతో 8 ఏండ్లక్రితం.. టెక్స్‌టైల్ పార్క్‌కు పునాదిరాయి వేసిన కేసీఆర్
వస్త్రనగరిగా రూపుమారిన వరంగల్‌నగరం.విదేశాలకు యంగ్‌వన్ ఉత్పత్తుల ఎగుమతి వరంగల్ జిల్లా సంగెం, గీసుగొండ మండలాల్లోని చింతలపల్లి,శాయంపేట గ్రామాల పరిధిలో చింతలపల్లి రైల్వేస్టేషన్‌కు అటూ ఇటూ 1,357 ఎకరాల సువిశాల స్థలంలో ‘ఫామ్ టు ఫ్యాబ్రిక్’ నినాదంతో సరికొత్త వస్త్ర నగరికి 2017 అక్టోబర్ 22న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు భూమిపూజ చేశారు.అప్పుడే దక్షిణ కొరియాకు చెందిన యంగ్‌వన్, ది స్వయంవర్ గ్రూప్,గోకుల్‌దాస్ ఇమేజెస్,సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్స్, సూర్యోదయ స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్,నందన్ డెనిమ్,షాహీ ఎక్స్‌పోర్ట్, జేకోట్ ఇండస్ట్రీస్ సహా పలు సంస్థలతో దాదాపు రూ. 3,020 కోట్లతో ఒప్పందాలు కుదిరాయి.
ఇందులో యంగ్‌వన్ అనే సంస్థది రూ. 1,000 కోట్ల పెట్టుబడి. తెలంగాణ ప్రజలకు పారిశ్రామిక విశ్వాసాన్ని కల్పించారు. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీజీఐఐసీ) కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో పరిశ్రమల స్థాపన,ఆయా సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించేందుకు కావాల్సిన సౌకర్యాలను కల్పించింది.220 కేవీ విద్యుత్తు సబ్‌స్టేషన్, అంతర్గత రోడ్లు,విద్యుత్తు సౌకర్యం వంటి అనేక వసతులను కల్పించింది. ప్రస్తుతం గణేశా, గణేశా ఇన్ఫోటెక్, యంగ్‌వన్, కిటెక్స్ సంస్థలు తమ యూనిట్లలో తొలిదశ ఉత్పత్తులను ప్రారంభించాయి.