*సిపిఎం మండల నాయకులు'గ్రామ కార్యదర్శి వడ్లకొండ సుధాకర్ డిమాoడు.
చెత్త చెదారంతో నిండిన మోరీలు దుర్గంధ వాసన వెదజల్లుతున్న వైనం, ఏండ్లు గడుస్తున్న పట్టింపు లేని పంచాయితీ అధికారుల ధోరణి.
*సిపిఎం మండల నాయకులు’గ్రామ కార్యదర్శి వడ్లకొండ సుధాకర్ డిమాoడు.
తెలుగు గళం న్యూస్ జనగామ
జఫర్గడ్ మండలంలోని తమ్మడపల్లి జి గ్రామంలో శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో వార్డుల్లో పర్యటించి గ్రామస్థులను పారిశుద్ధ సమస్యను అడిగి తెలుసుకున్నారు.అనంతరం సమస్యను పరిష్కరించాలం టు,ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పార్టీ మండల నాయకులు,తమ్మడపల్లి జి గ్రామ కార్యదర్శి వడ్లకొండ సుధాకర్ మాట్లాడుతూ..గ్రామంలో పారిశుద్ధ్యం లోపించి ఏండ్లు గడుస్తున్న పట్టించుకునే నాధుడే లేడన్నారు.రెండవ వార్డులో,కొంత కొమురయ్య ఇంటి నుండి వడ్లకొండ రాజు తండ్రి మల్లయ్య ఇంటి వరకు ఉన్న మోరిల్లో చెత్తాచెదారం పేరుకుపోయి మోరీలు పొంగి పొర్లతూ దుర్గంధ వాసన వెదజల్లుతున్నాయన్నారు.దీంతో ప్రజలు వార్డులోముక్కు మూసుకుని రాకపోకలు సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దీనివలన దోమలకు ఆవాసాలుగా ఏర్పడి దోమల ఉధృతి పెరిగి డెంగీ మలేరియా వంటి సీజన్ వ్యాధులు సోకి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నా రు.దీంతో గ్రామస్తులు హాస్పటల్ పాలై ఆర్థికంగా నష్టపోయి అప్పుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.అంతర్గత రోడ్లకు ఇరువైపులా పిచ్చి మొక్కలు పెరిగి క్రిమి కీటకాలకు,ఆవాసాలుగా మారి విషపురుగులు ఇండ్లలోకి ప్రవేశిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు.ఈ విషయంపై పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ గ్రామపంచాయతీలో నిధులు లేవంటూ సమస్యను పరిష్కరించకుండా వదిలేయడం అత్యంత బాధాకరమన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం సంబంధిత అధికారులు స్పందించి పై సమస్యలు పరిష్కరించే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు.లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి దశల వారి పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వేల్పుల పెద్ద రాములు ముక్కెర రాజు నక్క యాకన్న వడ్లకొండ రాజు ఎండి శంషోధిన్ పులిగిల్ల నాగరాజు కత్తుల రాజు కొంత అంజయ్య బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.