వడ్లు ఆరబెట్టే మిషన్ పై రైతన్నలకు అవగాహన
వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ ను వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద సందర్శించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ కు కేటాయించబడిన డ్రై హెడ్ మిషన్ వడ్లు అరెబెట్టే మిషన్ తో వడ్లు ఎలా అరాబెట్టుకోవాలనే విషయం పై రైతులకు అవగాహన కల్పించి రైతులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమములో మార్కెట్ కమిటీ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, వర్ధన్నపేట తహశీల్దార్ విజయ్ సాగర్,మార్కెట్ కార్యదర్శి శ్రీనివాస్ రాజు, అగ్రికల్చర్ అధికారి విజయ్ కుమార్,పౌర సరఫరా శాఖ అధికారులు ఐకెపి ధాన్యం కొనుగోలు నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.