పశువులకు గాలి కుంటు టీకాల కార్యక్రమం
మరిపెడ మండలంలోని రాంపురం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో పశువులకు స్థానిక పశువైద్యాధికారి మనోహర్ కృష్ణ కుమార్ పశువులకు గాలి కుంటు వ్యాధి నివారణ టీకాలను వేయటం జరిగింది అనంతరం డాక్టర్ మాట్లా డుతూ పశువులలో “గాలి కుంటు”దీనిని సాధారణంగా లంపీ స్కిన్ డిసీజ్ అని అంటారు. ఇది గాలిచేత వ్యాపించే ఒక వైరల్ వ్యాధి, ముఖ్యంగా గేదెలు, ఎద్దులు మొదలైన వాటిని ప్రభావితం చేస్తుంది అన్నారు.
లక్షణాలు:
చర్మంపై గుండ్రని ముద్దలు (గాలి కుంటుల్లా), జ్వరం, తినకపోవడం, పాలు తగ్గడం, కళ్ళు, ముక్కు నుంచి నీరు కారడం, కొన్నిసార్లు గర్భం ఉన్న ఆవులు గర్భస్రావం అవుతాయి అన్నారు. వాటి బాధలను చెప్పలేవని ముందు జాగ్రత్తగా రైతులు నివారణకు టీకాలు వేసుకొని రైతులు ఆర్థికంగా నష్టపోకుండా జాగ్రత్త పడాలని వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ మనోహర్ కృష్ణ కుమార్, వైద్య సిబ్బంది రాంధన్,ఓ ఎస్ లలిత, గోపాల్ మిత్ర లక్షాధికారి, రైతులు, తదితరులు పాల్గొన్నారు.