చెంచుపల్లిలోఎమ్మెల్యే గండ్ర సత్తన్న బర్త్డే వేడుకలు
భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు బర్త్డే వేడుకలను పురస్కరించుకొని ఆదివారం గండ్ర సత్తన్న వీరాభిమాని జిల్లా కాంగ్రెస్ యువ నాయకులు, దామరంచ పల్లె గ్రామ అధ్యక్షులు, మొట్టే కిరణ్ పటేల్ ఆధ్వర్యంలో చెంచుపల్లిలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఎమ్మెల్యే గండ్ర పుట్టినరోజు సందర్భంగా చెంచుపల్లి గ్రామానికి చెందిన విద్యార్థులకు నాలుగు సైకిళ్లు,50 బ్యాగులతో పాటు పెన్నులను కిరణ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు కలిసి అందజేశారు.నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే ఎమ్మెల్యే గండ్ర నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఉండాలని మరింత అభివృద్ధికి కృషి చేసేలా భగవంతుడు చూడాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పుల్లూరి బాబురావు, జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గూటోజు కిష్టయ్య, ఉమ్మడి రేగొండ మండల పార్టీ అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య, సూధన బొయిన ఓం ప్రకాష్, మటక సంతోష్, పాత పెళ్లి సంతోష్, పిఎసిఎస్ డైరెక్టర్ బొట్ల మధుసూదన్, బండారి రవి,చిగురు మామిడి కుమారస్వామి, బోయిని కుమార్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.