స్టేషన్ ఘనపూర్‌లో కరాటే శిక్షణ శిబిరం ప్రారంభం
డ్రంకెన్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ షౌలిన్ కుంగ్ ఫు ఆధ్వర్యంలో స్టేషన్ ఘనపూర్ గర్ల్స్ హై స్కూల్ మరియు శివునిపల్లిలోని శివాలయంలో శీతాకాల కరాటే శిక్షణ శిబిరం ఈ నెల 15 నవంబర్ 2025 (శనివారం) నుండి ప్రారంభం కానుంది.ఈ సందర్భంగా అకాడమీ ప్రతినిధి పెసరు సారయ్య మాట్లాడుతూ..“విద్యతో పాటు విద్యార్థులకు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ కూడా ఎంతో అవసరం.మహిళలపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడం కీలకం.అంతేకాకుండా విద్యార్థుల శారీరక దృఢత్వం,మానసిక ధైర్యం,ఆరోగ్య పరిరక్షణకు కరాటే ఎంతో తోడ్పడుతుంది”అని తెలిపారు.శిబిరంలో స్థానిక విద్యార్థులు,యువతీ యువకులు పాల్గొనాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో వంగ శ్రీనివాస్,పోడాల రాజేష్,పొన్న శివ,మహమ్మద్ జావిద్,మహమ్మద్ రజాక్,చిలగాని శ్రీశాంత్,సాయి,హర్షిత,సుహాసిని తదితరులు పాల్గొన్నారు.సంప్రదించవలసిన వారు పెసరు సారయ్య 98664 15312,మహమ్మద్ రజాక్ 89192 37751,చిలగాని శ్రీశాంత్-89856 36323 ఫోన్ చేయాలని కోరారు.