కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలి
వరంగల్ జిల్లా ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని తెలంగాణ ప్రజా స్వామిక కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు.సంఘం ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ ని కలిసి వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సంఘం నాయకుడు గజ్జ చందు మాట్లాడుతూ..ఎంజీఎం హాస్పిటల్‌లో సెక్యూరిటీ,సానిటేషన్,పేషెంట్ కేర్ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు సంవత్సరాలుగా తాత్కాలికంగా సేవలందిస్తున్నారు.కాంట్రాక్టు విధానాన్ని రద్దు చేసి,కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలలో భాగంగా వీరందరినీ పర్మనెంట్ చేయాలని” కోరారు.కలెక్టర్ సానుకూలంగా స్పందించి కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా కార్మిక నాయకుడు గొర్రె నాగరాజ్ మాట్లాడుతూ..గత 20 ఏళ్లుగా ఎంజీఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు తగిన జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.కాంట్రాక్టు విధానాన్ని రద్దుచేసి,కార్పొరేషన్ రూపంలో రిక్రూట్మెంట్ చేసి ప్రతి కార్మికుడికి కనీసం ₹26,000 వేతనం ఇవ్వాలి”అని అన్నారు.ఈ కార్యక్రమంలో చల్ల రాజు,తుల్లా సుధాకర్,నడిగొట్టు విజయ్,చారి తదితరులు పాల్గొన్నారు