విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంతో అవసరం
మానుకోట జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న టౌన్ సిఐ కట్ల మహేందర్ రెడ్డి, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో విద్యార్థులు సెల్ ఫోన్ కారణంగా చదువులకు దూరం అవుతున్నారని ఈ పోటీ ప్రపంచంలో చదువులపై ఉన్న శ్రద్ధ క్రీడలపై లేదని దానివలన విద్యార్థులు మానసిక ఎదుగుదలను కోల్పోతున్నారని అన్నారు
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ట్రస్మ జిల్లా అధ్యక్షులు చిర్రా ఏకాంతం గౌడ్ మాట్లాడుతూ జిల్లా స్థాయి క్రీడోత్సవాలు ఎంతో ఉత్తేజాన్నిచ్చాయని విద్యార్థుల యొక్క సంబంధాలు మెరుగుపడ్డాయని వారి కి క్రీడా స్ఫూర్తిని కల్పించగలిగామని అన్నారు ఈ క్రీడలు ప్రతి సంవత్సరం ఈ విధంగానే నిర్వహిస్తామని పాఠశాలల మీద ఉన్న అపోహలు తొలగించడం కోసం ఈ క్రీడలు మాకు ఎంతో దోహదపడ్డాయని అన్నారు ఈ సందర్భంగా క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై దీపికా రెడ్డి , ట్రస్మ రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి,ట్రస్మా రాష్ట్ర చీఫ్ అడ్వైజర్ జయప్రకాష్, తస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి అప్పారావు,తస్మా జిల్లా ట్రెజరర్ నరేష్ రెడ్డి,ట్రస్మా ఆర్గనైజర్ సెక్రటరీ తాళ్లపల్లి రమేష్ గౌడ్ తస్మా జిల్లా మాజీ అధ్యక్షులు పరమాత్మ చారి, జిల్లా క్రీడాకారుడు మేక దామోదర్ రెడ్డి,స్పోర్ట్స్ కన్వీనర్స్ గండి వెంకన్న, అల్వాల కార్తీక్ తస్మా జిల్లా వైస్ ప్రెసిడెంట్ సురేష్ మరియు ట్రస్మా మహబూబాద్ మండల అధ్యక్షులు కమ్మగాని కృష్ణమూర్తి వివిధ పాఠశాలల కరస్పాండెంట్స్ భూపాల్ రెడ్డి,మల్లారెడ్డి,రామకృష్ణ,మైఖేల్, యాకేష్,మరియు వివిధ పాఠశాల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.