నవంబర్ 14న జరిగే హామాలి యూనియన్ జిల్లా మహాసభ
నవంబర్ 14న ఆల్ హమాలి వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా 2వ మహాసభ జిల్లా కేంద్రం లోని సిఐటియు కార్యాలయంలో ఉంటుంది.ఈ మహాసభను విజయవంతం చేయాలని యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు కోరారు.రఘునాథపల్లి మండలం కేద్రం తో పాటు నిడిగొండ మహాలక్ష్మి గోదాం హమాలి యూనియన్ సమావేశం మద్దూరి యాదగిరి అధ్యక్షతన జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాపర్తి రాజు మాట్లాడుతూ మహాలక్ష్మి గోదాములో పనిచేస్తున్న హామాలి కార్మికులకు కనీస వసతులు లేవని మంచినీళ్లతో పాటు పని ముగించుకున్న తర్వాత కార్మికులు కడుక్కోవడానికి జనరల్ వాటర్ సైతం లేవని దీనివలన తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్లు యూనియన్ దృష్టికి వచ్చిందన్నారు
గోదాములో రాత్రిపూట లైట్లు లేకపోవడంతో ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉందన్నారు.పాములు తేళ్లు బారిన ఇబ్బందులు పడుతున్నట్లు కార్మికులకు తెలిపినట్లు పేర్కొన్నారు.ఈ విషయాన్ని సంబంధిత గోదాం ఓనర్ అధికారులు పట్టించుకోని కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు లేనిపక్షంలో యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు జిల్లాలో హామాలి కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వారి సమస్యల పరిష్కారం కోసం జిల్లా మహాసభలో చర్చిస్తామని అమాలి కార్మికులకు రాస ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని హెల్త్ కార్డులు ఇవ్వాలని ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పొదల నాగరాజు మండల నాయకులు కడారి ఆంజనేయులు బైరగోని బాలరాజు మహాలక్ష్మి గోదాం హామాలి యూనియన్ నాయకులు పెండేల శ్రీనివాస్ దేవర హరిబాబు కొంగరి నర్సయ్య దేవర మల్లేష్ దోరగొల్ల నర్సిహింలు దొరగొల్ల సత్తయ్య దేవనూరు యాకయ్య కాట బుచ్చయ్య చేవెళ్లి శ్రీశైలం రేగు భాస్కర్ షాడ వెంకటయ్య దేవర రమేష్ వీరస్వామి ఆవులు కాజా ఉప్పలయ్య యాదగిరి నరసయ్య తదితరులు పాల్గొన్నారు.