పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన డీఎస్పీ
భూపాలపల్లి జిల్లా డీఎస్పీ సంపత్ రావు ఈరోజు చిట్యాల పోలీస్ స్టేషన్ను సందర్శించి వార్షిక తనిఖీ నిర్వహించారు.తనిఖీలో భాగంగా స్టేషన్ రికార్డులు, సిబ్బంది క్రమశిక్షణ, ఆయుధాగారం, వాహనాలు, శుభ్రత తదితర అంశాలను సమీక్షించారు.
డీఎస్పీ ని చిట్యాల సీఐ మల్లేష్, ఎస్ఐ శ్రీ శ్రావణ్ కుమార్, సెకండ్ ఎస్ఐ హేమలత, థర్డ్ ఎస్ఐ ఈశ్వరయ్య, హెడ్ కానిస్టేబుల్స్ సురేందర్, చంద్రమౌళి, గిరి తదితరులు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం సిబ్బంది కిట్స్ తనిఖీ చేసి, వ్యక్తిగత పరికరాలు, రికార్డుల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.తనిఖీ సందర్భంగా డీఎస్పీ కేసు రిజిస్టర్లు, పెండింగ్ కేసులు, క్రైమ్ చార్టులు, స్టేషన్ శుభ్రత, లాకప్, ఆయుధాల భద్రత వంటి అంశాలను పరిశీలించారు. సిబ్బంది పని తీరు, రికార్డు నిర్వహణ పట్ల ప్రశంసలు వ్యక్తం చేశారు.తరువాత జరిగిన సిబ్బంది సమావేశంలో డీఎస్పీ సంపత్ రావు మాట్లాడుతూ “ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలగాలి. ప్రతి ఫిర్యాదుదారుడి సమస్యను సహనంతో విని, చట్టపరమైన పరిష్కారం చూపాలి. సైబర్ నేరాలు, ఆధునిక దొంగతన పద్ధతులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. పోలీసు సేవ అంటే క్రమశిక్షణ, బాధ్యత, అంకితభావం కలయిక. అందరూ ఈ విలువలను పాటించాలి” అని సూచించారు.అంతేకాక, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. చిట్యాల పోలీస్ స్టేషన్ను మరింత పారదర్శకంగా, ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే విధంగా పనిచేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో సీఐ మల్లేష్, ఎస్ఐలు శ్రావణ్ కుమార్, హేమలత, ఈశ్వరయ్య, హెడ్ కానిస్టేబుల్స్ సురేందర్, చంద్రమౌళి, గిరి, కానిస్టేబుల్స్ సందీప్, అస్లాం జానీ, లాల్ సింగ్, నాగరాజు, క్రాంతి కుమార్, రంజిత్, శ్రీనివాస్, మహిళా కానిస్టేబుల్స్ నాగమణి, శ్రావణి, మమత (ఏ. & జి.), లలిత, హోమ్ గార్డ్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.