జిల్లాలో వనరులు పుష్కలంగా ఉన్నాయి
భూపాలపల్లి జిల్లాలో వనరులు పుష్కలంగా ఉన్నాయని,వాటిని సక్రమంగా సద్వినియోగం చేసుకొని అన్ని రంగాల్లో జిల్లాను అభివృద్ధి చేసుకోవాలని వరంగల్ ఎంపీ, దిశా కమిటీ చైర్మన్ డాక్టర్ కడియం కావ్య అన్నారు.ఈరోజు సోమవారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడీవోసి సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ(దిశా) సమావేశంలో దిశా కమిటీ చైర్మన్ డాక్టర్ కడియం కావ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్ని శాఖల అధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వరంగల్ ఎంపీ, దిశా కమిటీ చైర్మన్ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ… జిల్లాలో వనరులు పుష్కలంగా ఉన్నాయని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని సూచించారు. జిల్లా విద్యా హబ్ గా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. వైద్య సేవలపై సమీక్షించిన చైర్మన్ 45 శాతం ఆపరేషన్లు, 55 శాతం సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని తెలిపారు.కు.ని. ఆపరేషన్లు అవగహన కల్పించాలని సూచించారు. ప్రసూతి వైద్యులు నియామకానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. డయాలసిస్ సేవలు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అందుబాటులోకి తేవాలని సూచించారు.ఇచ్చిన నిధులను సద్వినియోగం చేయాలని, జాప్యం వల్ల నిధులు వాపసు వెళ్లే అవకాశం ఉందని, 45 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 12 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు స్థల సమస్య ఉందని తెలుపగా ఎందుకు జాప్యం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం బాగా అభివృద్ధి కావాలని పధకాలు ఇస్తున్నామని పర్యవేక్షణ లోపం వల్ల జాప్యం జరుగుతోందని అన్నారు. చిన్నారులకు ఆటిజం ఆరోగ్య సమస్యల పరీక్షలు నిర్వహించేలా అంగన్ వాడి సిబ్బందికి అవగహన కల్పించాలని సూచించారు. జిల్లాలో 431 పాఠశాలలున్నాయని, 14208 విద్యార్థులున్నారని తెలిపారు. పిఎంశ్రీ 8 పాఠశాలలు ఉన్నాయని, నూతనంగా ఒక పాఠశాలకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.నోట్స్ లో పిఎంశ్రీ వివరాలు పెట్టాలని తెలిపారు. 12 భవిత కేంద్రాల్లో 60 మంది విద్యార్థులు ఉన్నారని డీఈఓ చెప్పిన సమాచారం మేరకు ఎలాంటి సేవలు అందిస్తున్నారని ఎంపీ అడిగిన ప్రశ్నలకు డీఈఓ సమగ్ర సమాచారం చెప్పడంలో డీఈఓ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఈ సారి సమగ్ర సమాచారంతో రావాలని, సమగ్ర సమాచారం ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.కెజిబివి పాఠశాలల్లో స్వీయ రక్షణ, యోగా, ఆరోగ్య పరీక్షలు, రక్త హీనత ఉన్నవాళ్లను గుర్తించి వైద్య సేవలు అందించడంతో పాటు ఆరోగ్య సంరక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. మధ్యాహ్న భోజనం మెనూ పాటిస్తున్నారా, ఆకస్మిక తనిఖీలు చేయాలని తెలిపారు. మైనింగ్ ఇక్కడ జరుగుతుంది,సీఎస్ఆర్ నిధులు ఇతర ప్రాంతాలకు ఇస్తున్నారు, ఎందుకు అలా జరుగుతుంది, మీకు ఎలాంటి పవర్స్ ఉండవా అంటూ మైనింగ్ అధికారిని ప్రశ్నించారు. సింగరేణి, జెన్కో సీఎస్ఆర్ నిధులు ఇవ్వకపోతే ఎలా? ఇది సులభంగా వదిలే విషయం కాదని, పిర్యాదు చేస్తే ఎలా వుంటదో చెప్పండి! అని అన్నారు. ఎంపీ రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని, బొగ్గు రవాణా వల్ల రహదారులు పాడవుతున్నాయని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టామని తెలిపారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు మాట్లాడుతూ… సింగరేణి సిఎస్ఆర్ నిధులు ప్రాథమిక పనులకు ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం ఇవ్వాలని స్పష్టం చేశారు.చట్టం 10 కి.మీ పరిధిలో ప్రాధాన్యత ఇవ్వాలని, తదుపరి 20 కి.మీ ఇవ్వాలని ఉందని విద్యా, వైద్య, అభివృద్ధికి ఇవ్వడం లేదని, ఇంట్లో ఆస్తిలా లెక్కపెడుతున్నారని ప్రజలు వ్యాధులతో ఇబ్బంది పడుతున్నా ఖర్చు పెట్టె పరిస్థితి ఎందుకు లేదని ఆగ్రహ వ్యక్తం చేశారు.మా నిధులు మాకు ఇస్తలేరని ఇక్కడ కాకుండా వేరే ప్రాంతాలకు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు.పనులు చేసిన వాళ్లు మా ఇంటికి వస్తున్నారని,ఆన్లైన్ చేయాలని, రాజుల సొమ్ము రాళ్ళ పాలని ఎందుకు ఎక్సెస్ ఇచ్చారని, పనులు అయిపోయాయి ప్రారంభం కాని పనుల వివరాలు తనకు తెలియచేయాలని పీఆర్ ఈఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల అవసరాలకు నిధులు ఇస్తున్నాయని ఎందుకు,కాంట్రాక్టర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు మధ్యలో విద్యుత్తు పోల్స్ ఉన్నాయని ప్రజలు ప్రమాదాలతో మరణి స్తున్నారని ఈ సమస్య ఉన్నదా లేదా అంటూ పీఆర్ ఇంజినీర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎంఎఫ్టీ పక్కదారి పట్టించొద్దు, పక్క దారి పడితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కెజిబివిల్లో చాలా సమస్యలు ఉన్నాయని, డీఈఓ గా ఏవైనా సమస్యలు నా దృష్టికి తెచ్చారా, పేపరు పెడితే సరిపోదని నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు. అర్బన్ పాఠశాలను వేరే ప్రాంతానికి తరలించాలని స్పష్టం చేశారు. పొలాల్లో ఇసుక మేటలు తీసేందుకు అనుమతులు ఇవ్వాలని, తీస్తే రైతులు పంటలు పండించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.