తెలంగాణలో ‘ఇద్దరు పిల్లల నిబంధన’ రద్దు
తెలంగాణలో దాదాపు మూడున్నర దశాబ్దాలుగా అమల్లో ఉన్న ‘ఇద్దరు పిల్లల నిబంధన’ ఇకపై స్థానిక సంస్థల ఎన్నికల్లో అర్హతకు ఆటంకం కానుంది. రెండు మందికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించే చట్టాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మఆమోదం తెలిపారు. దీంతో ఆర్డినెన్స్ అధికారికంగా అమల్లోకి వచ్చింది.
1994లో అమలైన నిబంధన – అప్పటి లక్ష్యం జనాభా నియంత్రణ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1994లో జనాభా పెరుగుదలను నియంత్రించాలనే ఉద్దేశంతో ఈ నిబంధనను ప్రవేశపెట్టింది. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు సర్పంచ్, వార్డ్ మెంబర్, ఎంపీటీసీ, జడ్‌పీటీసీ వంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయకూడదనే పరిమితిని చట్టబద్ధం చేశారు. గ్రామీణ జనాభా నియంత్రణలో భాగమని భావించి దశాబ్దాల పాటు ఈ నిబంధన కొనసాగింది.అయితే కాలానుగుణ మార్పులు, కుటుంబ నియంత్రణపై ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలు, గ్రామీణ సమాజంలో వచ్చిన మార్పులు, ప్రస్తుతం జనాభా వృద్ధి రేటులో వచ్చిన స్థిరత్వం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిబంధనను రద్దు చేయాలని నిర్ణయించింది.
అభ్యర్థుల అర్హతకు కొత్త స్వేచ్ఛ*
ఆర్డినెన్స్ అమల్లోకి రావడంతో ఇద్దరు పిల్లల నిబంధన ఇకపై ఎన్నికల్లో అర్హతను నిరోధించే అంశం కాదు. దీంతో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు.సర్పంచ్, వార్డు సభ్యుడు, ఎంపీటీసీ, జడ్‌పీటీసీ స్థానాలకు తిరిగి అర్హత,గతంలో నిబంధన కారణంగా వెనక్కి తగ్గిన వేలాది మంది వ్యక్తులకు మళ్లీ అవకాశాలు,గ్రామీణ రాజకీయాల్లో పోటీ మరింత విస్తృతం అవుతుందనే అంచనాలు ఈ నిర్ణయంతో గ్రామాల్లో, మండలాల్లో రాజకీయ సమీకరణలు మారే అవకాశమున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.
ప్రభుత్వం నిర్ణయం – ప్రజాస్వామ్యానికి మరింత విస్తృతత
కుటుంబ పరిమాణం ఆధారంగా ప్రజాస్వామ్యంలో పాల్గొనడానికి అడ్డంకులు పెట్టడం సరైంది కాదనే అభిప్రాయం వెంటనే ప్రభుత్వం ఈ నిర్ణయానికి వచ్చింది. స్థానిక సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, ప్రజాసేవా దృక్పథం ప్రధానమని, కుటుంబ పరిమాణం అర్హతకు ప్రమాణంగా ఉండకూడదని ప్రభుత్వం స్పష్టం చేసిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
రాబోయే ఎన్నికల్లో స్పష్టమైన ప్రభావం
ఈ నిబంధన రద్దు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ సమీకరణలను పూర్తిగా మార్చే అవకాశముంది.పాత నిబంధన కారణంగా ఎన్నేళ్లుగా పోటీ చేయలేకపోయిన అభ్యర్థులు ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారు. గ్రామీణ రాజకీయాల్లో కొత్త నాయకత్వం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానిక నేతలు చెబుతున్నారు