మత్స్యకార సంఘం రాష్ట్ర 4వ మహాసభలు
కరీంనగర్ పట్టణ కేంద్రంలో ఈ నెల 25,26 తేదీలలో జరగనున్న తెలంగాణ మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలన్న లక్ష్యంతో,స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలో గురువారం రోజు వాల్ పోస్టర్ను విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో టిఎంకెఎంకెఎస్ మండల అధ్యక్షులు గొనెల వెంకన్న,మండల ప్రధాన కార్యదర్శి లింగనబోయిన రాజు,మహిళా మండల బాధ్యులు పిట్టల స్వరూప పాల్గొన్నారు.అలాగే మండల నాయకులు పి.శంకర్,గోనెల రాజయ్య,మెడబోయిన అరుణ,పిట్టల విజయ్,బాలబాయిన శిరీష,పిట్టల భద్రమ్మ తదితరులు హాజరయ్యారు.మహాసభలను విజయవంతం చేయడానికి ప్రతి మత్స్యకార కుటుంబం భాగస్వామ్యం కావాలని నాయకులు పిలుపునిచ్చారు.