ఇండ్లు నిర్మించుకొని బిల్లులు పొందాలి
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ హౌసింగ్ పథకంలోని ఇళ్లను లబ్ధిదారులు నిర్ణీత సమయంలో పూర్తి చేసి,సమయానికి బిల్లులను పొందాలని హౌసింగ్ ఏఈ అఖిల సూచించారు.శుక్రవారం మండలంలోని నమిలిగొండ గ్రామానికి చెందిన అక్కిరెడ్డి కవిత నివాసంలో నిర్వహించిన ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఏఈ అఖిల,కవిత నిర్మాణాన్ని ప్రశంసించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..“స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను వేగంగా పూర్తి చేసి,అర్హులైన ప్రతి ఒక్కరూ సమయానికి లాభాలు పొందాలి”అని తెలిపారు.కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి పురుమాని రజాక్ యాదవ్,పులి యాకయ్య గౌడ్,కుమార్,ఇందిరమ్మ కమిటీ సభ్యులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.