టాలెంట్ పరీక్షల వలన విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం
విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానం,తార్కిక ఆలోచన పెంపొందించడంలో చెకుముకి సైన్స్ టాలెంట్ పరీక్షలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెకుముకి రాష్ట్ర కన్వీనర్ టి.శ్రీనాథ్ తెలిపారు.జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో,మండల కన్వీనర్ చిక్కుడు శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ పరీక్షలు శివునిపల్లి ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగాయి.మండలంలోని 19 పాఠశాలల నుండి పాఠశాల స్థాయి విజేతలైన 57 మంది విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొన్నారు.స్థానిక కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కె.రమేష్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ..ఇలాంటి శాస్త్రీయ పరీక్షలు విద్యార్థుల్లో మూఢనమ్మకాలపై అవగాహన పెంచడంతో పాటు సృజనాత్మకతను పెంపొందిస్తాయి అని తెలిపారు.భావి శాస్త్రవేత్తలుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు.విభాగాల వారీగా ప్రథమ స్థానాలు:-ప్రభుత్వ ఇంగ్లీషు మీడియం విభాగం:తాటికొండ ఉన్నత పాఠశాల.రెసిడెన్షియల్ విభాగం:ఎం.జె.పి బాలుర ఉన్నత పాఠశాల.ప్రైవేట్ విభాగం:సెయింట్ మేరీ ఉన్నత పాఠశాల.ఈ పాఠశాలల విద్యార్థులు మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించి జిల్లా స్థాయికి ఎంపికయ్యారని చెకుముకి మండల కన్వీనర్ చిక్కుడు శ్రీనివాస్ మరియు పరిశీలకులు కోరుకొప్పుల రాజు తెలిపారు.తదుపరి,ద్వితీయ స్థానాల్లో నిలిచిన చాగల్,మీదికొండ,మైనారిటీ రెసిడెన్షియల్ ఉన్నత పాఠశాల,సెయింట్ థామస్,ఒయాసిస్ పాఠశాల విద్యార్థులతో పాటు,పాల్గొన్న వారందరికీ ప్రశంసాపత్రాలు,బహుమతులను రాష్ట్ర కన్వీనర్ టి.శ్రీనాథ్,ప్రధానోపాధ్యాయులు కె.రమేష్ మరియు నిర్వాహకులు అందజేశారు.అదనంగా,ప్రతి పాల్గొన్న విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ఇవ్వబడినాయి.ఈ కార్యక్రమంలో శాస్త్ర ఉపాధ్యాయులు ప్రవీణ్ కుమార్,రంజిత్ కుమార్,జి.శ్రీనివాస్,ఎస్.ఎస్.యు.ఎం.శర్మ,వసంత కుమారి,యాదగిరి,వెంకన్న,దాస్,రవిందర్,సునిత,మనోజ్ కుమార్,సుధ,ప్రసాద్ బాబు,అబేద బాను,మహేందర్,కిరణ్,సుధాకర్,సురేందర్ తదితరులు పాల్గొన్నారు.