స్వెరోస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వేరోస్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పర్వతగిరి మండల కేంద్రంలో వాక్ ఫర్ ది నేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్వేరోస్ నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా కల్పించబడ్డ హక్కులపై అందరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ప్రతి పౌరుడు తమ హక్కులను సాధించుకోవడానికి రాజ్యాంగమే వజ్రాయుధమని రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు దూడల సిద్ధూ ప్రధాన కార్యదర్శి కందికట్ల ప్రవీణ్ అధికార ప్రతినిధి గారే జయరాజ్ స్వేరో కోర్ కమిటీ ఇంచార్జీ సిద్దు, జిల్లా నాయకులు బానోత్ రమేష్, పర్వతగిరి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఎద్దు రాహుల్, ధారావత్ జీవన్, స్వెరోస్ నాయకులు విజయ్, జైపాల్, నవీన్, వినోద్, గౌతం, వెంకన్న, గణేష్ తదితరులు పాల్గొన్నారు.