ఐద్వా కేంద్ర కమిటీ సభ్యురాలుగా ప్రభావతి ఎన్నిక
Nalgondaకేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఈ నెల 6 నుండి 9 వరకు జరిగిన అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జాతీయ 13వ మహాసభలలో కేంద్ర కమిటీ సభ్యురాలుగా ఐద్వా నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి ఎన్నికైనది. 1992 లో చదువు వెలుగు ద్వారా ఉద్యమాలలోకి వచ్చి ప్రజానాట్యమండలి కళాకారునిగా వ్యవసాయ కూలీల ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి కూలీరెట్లు భూమి సమస్యలపై అనేక కార్యక్రమాలు నిర్వహించినది. తదనంతరం మహిళా సంఘం నల్గొండ డివిజన్ కార్యదర్శిగా ప్రస్తుతం ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నది. నిరంతరం మహిళల సమస్యలపై రాజీలేని ఉద్యమాలు నిర్వహిస్తూ మహిళలకు అండగా నిలబడినది. మహిళలపై విద్యార్థులపై జరిగిన ఘటనలపై సీరియస్గా స్పందించి నిందితులకు కతినమైన శిక్షలు పడే విధంగా నిలబడినది. నిరుపేదలకు భూమి ఇండ్ల స్థలాల సమస్యపై గుడిసెలు పోరాటం నిర్వహించి తొమ్మిది రోజులు జైలుకెళ్ళినది. మరియొకసారి ఐదు రోజులు జైలుకు సైతం వెళ్ళినది. నల్లగొండ జిల్లాలో మండల కేంద్రాలు గ్రామాలలో ఐద్వా కమిటీలను విస్తృతపరచి ఐద్వాలో సభ్యులుగా చేర్పించి ప్రజలను చైతన్య పరుస్తూ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ ప్రజాతంత్ర ఉద్యమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలుగా ఉన్నది. నల్లగొండ జిల్లాలో జరిగిన ప్రజాతంత్ర పోరాటాలలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్నది. ప్రస్తుతం ఐద్వా మహాసభలలో కేంద్ర కమిటీ సభ్యురాలుగా ఎన్నికైనది. భవిష్యత్తులో మహిళల సమస్యలపై ఉద్యమాలు నిర్వహిస్తామని అనునిత్యం ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామని ఇచ్చిన పదవి బాధ్యతను అలంకరణ ప్రాయంగా కాకుండా ప్రజా ఉద్యమ పోరాటాలకు ఉపయోగపడే విధంగా చేస్తానని అన్నారు.