సైబర్ భద్రత అవగాహన కార్యక్రమం
డిజిటల్ యుగంలో విద్యార్థుల భద్రత అత్యవసరం – ‘1930’ హెల్ప్‌లైన్ వినియోగంపై పోలీసుల స్పష్టీకరణ రేగొండలోని వాణి విద్యానికేతన్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.వేగంగా మారుతున్న డిజిటల్ ప్రపంచంలో విద్యార్థులు ఎదుర్కొనే ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సర్వు రజిన్ కుమార్ ముందడుగు వేసి ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.కార్యక్రమానికి రేగొండ సబ్-ఇన్స్పెక్టర్ రాజేష్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు విలువైన సూచనలు అందించారు.ఎస్సై రాజేష్ మాట్లాడుతూ,సోషల్ మీడియా వాడకంలో జాగ్రత్తలు, ఫేక్ లింకులు, ఫిషింగ్, ఆన్‌లైన్ గేమింగ్ ప్రమాదాలు, యాప్‌ల ద్వారా జరిగే మోసాలు, బ్యాంకింగ్ ఫ్రాడ్ వంటి అంశాలను విద్యార్థులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. “డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లను వాడుతున్న ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. తెలియని వ్యక్తులతో మాట్లాడటం, వ్యక్తిగత వివరాలు పంచుకోవడం పూర్తిగా మానుకోవాలి” అని సూచించారు.
‘అవగాహన లేకపోవడమే సైబర్ నేరాలకు ప్రధాన కారణం’
రెండవ ఎస్సై సాయి త్రిలోక్ నాథ్ రెడ్డి విద్యార్థులతో సంభాషిస్తూ,
“సైబర్ నేరగాళ్లు ఎక్కువగా నిర్లక్ష్యం చేసిన క్షణాలను లక్ష్యంగా చేసుకుంటారు. ఓ టీ పి లు, బ్యాంక్ వివరాలు, ఫోన్‌లో వచ్చే సందేహాస్పద లింకులు ఎవరితోనూ పంచుకోవద్దు. ఏ చిన్న అనుమానం వచ్చినా వెంటనే పోలీసులను సంప్రదించాలి” అని సూచించారు.
పోలీసు అధికారులు ఈ సందర్భంగా ప్రభుత్వం అందించే అత్యవసర సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ ‘1930’ ప్రాముఖ్యతను వివరించారు.
ఈ సేవ 24 గంటలు అందుబాటులో ఉంటుంది అని విద్యార్థులకు తెలిపారు.
విద్యార్థులు ఈ నంబర్ను తప్పనిసరిగా గుర్తుంచుకుని ఇంట్లో పెద్దలకు కూడా తెలియజేయాలని సూచించారు.
కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు సోషల్ మీడియా భద్రత, యూట్యూబ్–ఇన్‌స్టాగ్రామ్ ప్రమాదాలు, గేమింగ్ అడిక్షన్, వ్యక్తిగత సమాచార రక్షణ వంటి అంశాలపై ప్రశ్నలు అడగగా, పోలీసు అధికారులు ప్రతి అంశాన్ని పూర్తిగా వివరించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు రజిన్ కుమార్ మాట్లాడుతూ
“సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. విద్యార్థుల్లో అవగాహన పెంపుకు ఇలాంటి కార్యక్రమాలు అత్యంత అవసరం. పోలీసు శాఖ చేసిన ఈ మంచి ప్రయత్నానికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది అరుణ్, నరేష్,పృథ్వి, మహేష్, పాఠశాల ఉపాధ్యాయులు మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
ఏదైనా సైబర్ నేరం జరిగిన వెంటనే ‘1930’ కు కాల్ చేస్తే తక్షణ స్పందన లభిస్తుందని,
ముఖ్యంగా ఆన్‌లైన్ మనీ ఫ్రాడ్ జరిగితే వెంటనే ఫిర్యాదు చేస్తే డబ్బులు నిలిపివేయించగల అవకాశాలు ఎక్కువగా ఉంటాయని,